మెదక్ లో ఘనంగా బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు... 

మెదక్ లో ఘనంగా బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు... 

WhatsApp Image 2025-04-27 at 11.48.44 AM
పార్టీ జెండా ను అవిశరించిన పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి..

మెదక్ ఏప్రిల్ 27 (ప్రజా స్వరం)

Read More డిగ్రీ కాలేజ్ పై పోలీస్ లకు ఫిర్యాదు చేసిన తాహాసీల్దార్

బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ను మెదక్ బీఅర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి బీఅర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ఈ పార్టీ ఆవిర్భవించడం జరిగిందన్నారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు ప్రతి చేస్తున్న విధానాలను ఎండగడుతూ బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట సాధన కోసం ఎంతో మంది అమరులు అయ్యారని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. రాష్ట ప్రధాత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్టాన్ని సాధించి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టారన్నారు. అనంతరం వరంగల్ _ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ సభకు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మపర్సన్ లావణ్య రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ సర్పంచ్ లు, మాజీ కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More కేసీఆర్ ప్రసంగంలో పస లేదు