రైలు ఇంజన్ పై రాళ్ల దాడి… 

రైలు ఇంజన్ పై రాళ్ల దాడి… 

లోకో పైలట్ కు గాయాలు.....

 

ప్రజాస్వరం : హైదరాబాద్ / అమరావతి/ ఒంగోలు : జూన్ 05 :

 

ఏపీలో దారుణం జరిగింది. కదులుతున్న రైలు ఇంజన్పై రాళ్ల దాడి జరిగింది. ఘటనలో సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్కు తీవ్ర గాయాలతో రక్తస్రావం జరిగింది. న్యూఢిల్లీ నుండి చెన్నై వెళ్తున్న రైలు నంబర్ 12616, సింగరాయకొండ ప్రాంతం గుండా వెళ్తుండగా కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంజన్ (లోకో)పై దాడి చేసారు. దాడిలో డ్యూటీలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ జయరామ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే రైలు సమీపంలోని స్టేషన్లో నిలిపివేసి, చికిత్స నిమిత్తం జయరాం ను ఆసుపత్రికి తరలించారు.