ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ పత్తి నర్సింలు ...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ పత్తి నర్సింలు ...

దామరకుంటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం

గజ్వేల్, ఫిబ్రవరి 28 (ప్రజాస్వరం): 

 

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి శనివారం ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు బక్కల చిన్న లక్ష్మి ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన సర్పంచ్ పత్తి నర్సింలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని,కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని,నిరుపేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో సాకారం అవుతుందని గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతుందని,నిరుపేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని,గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు