ప్రజ సేవకే నా జీవితం అంకితం...

కౌన్సిలర్ అభ్యర్ధి ఎం.డి.ఆరిఫ్

ప్రజ సేవకే నా జీవితం అంకితం...

మేడ్చల్, జనవరి 30 (ప్రజాస్వరం):                                                20 ఎండ్లుగా కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఎల్లంపేట మున్సిపాలిటీ 23 వ వార్డు డబిల్పూర్ కౌన్సిలర్ అభ్యర్థిగా పార్టీ తనను ఎన్నికల బరిలో నిలిపిందని కౌన్సిలర్ అభ్యర్థి ఎండి ఆరిఫ్ అన్నారు. నేడు 23వ వార్డు డబిల్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ నామినేషన్ ర్యాలీ నిర్వహించి భారత్ బైబిల్ కాలేజీలో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎండీ ఆరిఫ్ మాట్లాడుతూ.. తన తండ్రి పేరిట ఏర్పాటుచేసిన ట్రస్టు ద్వారా ప్రజలకు సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు చెప్పారు. తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి, ప్రజల అవసరాలు, ప్రజాసేవకై మరింత విస్తృతంగా పనిచేస్తానని చెప్పారు. కరోనా సమయంలోను ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు అన్ని విధాల సహాయంగా ఉండటం జరిగిందని అన్నారు. నామినేషన్ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు... అశ్రు నయనాల మధ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రొండా మల్లారెడ్డి అంత్యక్రియలు...
మేడ్చల్, ఫిబ్రవరి 12 (ప్రజాస్వరం): మేడ్చల్ జిల్లా పూడూరు-కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని పూడూరు గ్రామానికి చెందిన హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయ ధర్మకర్త,కాంగ్రెస్ పార్టీ సీనియర్...
ఊరేగింపు బాణాసంచా రోడ్డు షోలకు అనుమతి లేదు...
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి...
క్యాంప్ కు తరలిన బీఆర్ఎస్  ... గెలుపు పై ధీమా....
తూప్రాన్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి...
ఇందిరమ్మ ఇండ్లు ధ్రువీకరణ పత్రాలు పంపిణి...
ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నిక లు భారీ పోలీస్ బందో బస్తూ....