ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

గజ్వేల్,జనవరి 21 (ప్రజాస్వరం) : 

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ ఔట్‌సోర్సింగ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అన్నపూర్ణ హాజరయ్యారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దుర్గం శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ అన్నపూర్ణ చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, స్వామి, నవీన్, భాను, కమలాకర్, మధు,శ్రీనివాస్, హుస్సేన్, దేవేందర్, ఉద్యోగులు పాల్గొన్నారు.