ప్రభుత్వ భూమి ని కబ్జా నుండి కాపాడాలి...
మేడ్చల్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):
జిహెచ్ఎంసి పరిధి మేడ్చల్ సర్కిల్లోని ఉమా వెంకట్ రెడ్డి కాలనీ లోని సర్వే నెంబరు 1045/1 లోగల 800 గజాల భూమిని కొందరు రియాల్టర్లు కబ్జా చేశారని స్థానిక కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై శుక్రవారం స్థానికులు మీడియాతో మాట్లాడుతూ.. 1979వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఇండ్లు లేని పేదల కోసం అధికారులతో మాట్లాడి 132 మందికి ఇండ్ల స్థలాలను ఇచ్చారని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ ఆక్వాజేషన్లో ఉన్నటువంటి మరికొంత 8 వందల గజాల స్థలాన్ని కొందరు ప్లాట్లుగా చేసి దోంగ రిజిస్ట్రేషన్ లు చేసుకొని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ల్యాండ్ ఆక్వాజేషన్ ఉన్న స్థలాన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని కబ్జా చేశారని ఇదే విషయమై అధికారులు స్పందించి కబ్జా చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోని ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని స్థానికులు కోరారు..


