సిఐటియు ఆధ్వర్యంలో కేవల్ కిషన్ వర్ధంతి
తూప్రాన్_ ప్రజాస్వరం కేవల్ కిషన్ 65వ వర్ధంతి కార్యక్రమాన్ని తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించారు. తూప్రాన్ మండల కేంద్రం లోని పోతారాజపల్లి కామన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు . ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మహేందర్ రెడ్డి రెడ్డి మాట్లాడుతూ కేవల్ కిషన్ నిరంతరం ప్రజా కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం చేసేవారని అన్నారు. భూ హక్కులు, మహిళా హక్కులు, ప్రజా, కార్మిక హక్కుల కోసం నేటికీ స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. కేవల్ కిషన్ ఆశయ సాధన కోసం రాబోయే కాలంలో పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు యం, నర్సింలు, గూడాల రవీంద్ర ప్రసాద్, బి స్వామి, వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు.


