తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....

మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి....

తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు..

మెదక్, అక్టోబర్ 14 (ప్రజాస్వరం) :

 

ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు. రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్‌, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, మాజీ జెడ్పీ చైర్మన్‌ తుల.ఉమ తదితరులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. బీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో హాజరై ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో జరుపుకునే ఈ పండుగ మహిళ ల్లో ఐక్యత ను చాటుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ఆడపడుచులందరూ బతుకమ్మ పండుగ ను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Latest News

తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ... తూప్రాన్ 16వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టల పంపిణీ...
తూప్రాన్, అక్టోబర్ 14(ప్రజాస్వరం) : ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా తూప్రాన్ మున్సిపల్ 16వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త...
తెలంగాణ సంస్కృతి కి ప్రతీక బతుకమ్మ....
పేద కుటుంబానికి తిరుపతిరెడ్డి ఆర్థిక చేయూత....
తూప్రాన్ 15 వ వార్డులో చెత్తబుట్టల పంపిణీ... 
గాయత్రీ దేవిగా దర్శనమిచ్చిన గడి మైసమ్మ తల్లి...
వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం....
బీడీ కార్మికుల జీవనభృతి కోసం భారీ ర్యాలీ, ధర్నా..