కుమ్మెర జాతర ఘటనపై బీఆర్ఎస్ స్పందన

డీజీపీని కలిసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

కుమ్మెర జాతర ఘటనపై బీఆర్ఎస్ స్పందన

నాగర్ కర్నూలు , హైదరాబాద్ (ప్రజాస్వరం ) : 


నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దైవదర్శనానికి వెళ్లిన రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి ఘటనపై రాష్ట్ర డిజిపిని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీ కుటుంబానికి చెందిన మహిళపై దాడి, 2నెలల పసికందు మరణం పై డిజిపికి పిర్యాదు చేశాం. సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యాచారాలు,మనబంగాలు జరుగుతున్న దుర్భాగ్య స్థితి కాంగ్రెస్ పాలనలో కొనసాగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక తెలంగాణలో పాలీసులు నిమిషాలలో కేసు ఛేదించే వారు. ఇప్పుడు పట్టపగలు అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఒక నిరుపేద మహిళపై దాడి చేసి,ప్రైవేట్ పర్ట్స్ పై చేతులు వేస్తూ దాడి చేశారు. ఒక జాతరలో దైవ దర్శనానికి వస్తే.. తక్కువ కులం అని మహిళపై దాడి చేసి కాంగ్రెస్ రౌడీలు చిన్న పసికందును తన్ని చంపారని అన్నారు.బాధితులు పిర్యాదు చేసిన కూడా పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు. కొంత మంది పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. అధికార పార్టీ మెప్పు కోసం పనిచేస్తున్నారు. బాధిత మహిళకు కోటి రూపాయల ఆర్థిక సాయం,ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాధితులపై అత్యాచారాం కేసు కింద కేసు నమోదు చేసి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని అన్నారు.బాధితులకు న్యాయం చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం. ఈ కేసుపై నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం పనిచేసి సంతోషం గా జీవించాలని కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని అన్నారు.

 

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....