ఆర్టీసీ కార్మికుల సంబరాలు...

ఆర్టీసీ కార్మికుల సంబరాలు...

సమస్యల పరిష్కారనికి సానుకూలంగా స్పందన పై హర్షం....

 

ప్రజాస్వరం : మెదక్ ,ఏప్రిల్ 25 

 

టీజీఎస్ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల కు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సందర్భంగా మెదక్ ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు పటాకులు కాల్చి మిఠాయి తినిపించుకోనీ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా సానుకూలంగా స్పందించడం సంతోషదాయకమన్నారు. జేఏసీ నాయకులతో సుమారు పన్నెండు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపి ముఖ్యమైన 11 % ఫిట్మెంట్, యూనియన్ల ఎన్నికల నిర్వహణ కు వంటి డిమాండ్ల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడం హర్షణీయామని అన్నారు. శాంతియుతంగా నిర్వహించిన సమ్మె కార్యక్రమాలలో తమకు మద్దతు ఇచ్చిన అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల డిమాండ్ లకు సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధాకృష్ణన్ రావు, కొత్త రాజు, సంగమేశ్వర్, పడిగి నర్సింలు ప్రభుకుమార్, రుక్మయ్య, స్వప్న, విమల, సందీప, నాగరాణి, కృష్ణ, వినీలా, ఎమ్ఎస్ నారాయణ, భాగ్యమ్మ, భిక్షపతి, యాదయ్య, సత్యశ్చంద్ర, ఇజాజ్, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Latest News

ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి.. ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి..
మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసింది..    ప్రజాస్వరం : చేగుంట , ఏప్రిల్ 25   ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని...
చిన్నారులకు 'సంస్కార సుధ' శిక్షణ........
ఆర్టీసీ కార్మికుల సంబరాలు...
ముగిసిన వార్డు సభ్యుల శిక్షణ.....
బీజేపీ శ్రేణులు ధర్నా.....
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించింది...
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.....