ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి

ఈడీ విచారణకు హజరయిన మంచు లక్ష్మి

హైదరాబాద్, (ప్రజాస్వరం) : 


బెట్టింగ్ యాప్ కేసు విచార‌ణ‌లో భాగంగా న‌టి మంచు లక్ష్మి హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో ఉన్న‌ ఈడీ కార్యాల‌యం ముందుకు హాజ‌రైయారు.బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం కేసులో దాదాపు మూడు గంట‌ల పాటు ల‌క్ష్మిని ఈడీ విచారించింది. తాను ప్ర‌మోట్ చేసిన యోలో అనే యాప్ లావాదేవిల‌తో పాటు ఇత‌ర అంశాల‌పై లక్ష్మి స్టేట్‌మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. అలాగే యాప్ ప్ర‌మోట్ చేసినందుకు తీసుకున్న పారితోషికంపై ఈడీ ఆరా తీసింది. అనంత‌రం త‌న బ్యాక్ స్టేట్‌మెంట్లను లక్ష్మి ఈడీకి అందించింది. ఇక విచార‌ణ అనంతరం ల‌క్ష్మి ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో భాగంగా విచారణకు రావాలని మంచు ల‌క్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....