భూమికి దగ్గరగా చంద్రుడు

కను విందు చేయనున్న "సూపర్ మూన్"

భూమికి దగ్గరగా చంద్రుడు

భూమికి దగ్గరగా చంద్రుడు 
కను విందు చేయనున్న "సూపర్ మూన్"
 మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు సోమవారం నాడు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడని తెలిపింది. ఈ సూపర్ మూన్ నేటి ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడొచ్చని తెలిపింది.  మంగళవారం ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా వివరించింది.ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా... భారత్ లో ఆగస్టు 19 రాత్రి నుంచి ఆగస్టు 20 ఉదయం వరకు కనిపిస్తుంది. కాగా, సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే, సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడని నాసా పేర్కొంది. images (3)

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..