ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్

ఎమర్జెన్సీగా  ల్యాండ్ అయిన వాయుసేన అపాచీ హెలికాప్టర్


హైదరాబాద్   (ప్రజాస్వరం) : భారత వాయుసేనకు చెందిన అత్యాధునిక అపాచీ అటాక్ హెలికాప్టర్ పంజాబ్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో నంగాల్‌పుర్‌ పరిధిలోని హాలెడ్ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో పైలట్లు  సురక్షితంగా దించారు. పఠాన్‌కోట్ సమీపంలోని ఒక గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమికంగా తెలియడంతో, పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా హెలికాప్టర్‌ను సురక్షితంగా కిందకు దించారు.ఈ ఘటన కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం కానీ వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు.