ఏడుపాయల వన దుర్గమ్మ అమ్మవారి గర్భ గుడిని తాకిన వరద నీరు.

ఏడుపాయల వన దుర్గమ్మ  అమ్మవారి గర్భ గుడిని  తాకిన వరద నీరు.

ఏడుపాయల వన దుర్గమ్మ  అమ్మవారి గర్భ గుడిని  తాకిన వరద నీరు.
మెదక్ : 
తెలంగాణ రెండవ అతి పెద్ద ప్రసిద్ధి గాంచిన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ గర్భగుడి లోకి వరద నీరు చేరింది. ఆదివారం మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం నాగసాన్ పల్లి గ్రామం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి మరింత పెరిగింది. దీంతో వనదుర్గమ్మ గర్భగుడి లోకి వరద నీరు చేరింది. భక్తుల దర్శనార్థం ఆలయ రాజగోపురం లో వన దుర్గ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు పూజ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. వనదుర్గ ఆలయ పరిసర ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంజీర పరివాహక ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ సూచించారు.55