బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా సుంకు నవీన్ ముదిరాజ్...
By Prajaswaram
On
మేడ్చల్,(ప్రజాస్వరం) :
మేడ్చల్ రూరల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని బీజేవైఎం (భారతీయ జనతా యువమోర్చా) మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధి సుంకు నవీన్ కుమార్ ముదిరాజ్ తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేవైఎం మేడ్చల్ రూరల్ జిల్లా అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, యువతను పార్టీ వైపు ఆకర్షించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సుంకు నవీన్ ముదిరాజ్ వెల్లడించారు.
Latest News
15 Oct 2026 21:37:03
మెదక్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం) : మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్...


