తూప్రాన్ సమీకృత భవనంలో భారతరత్న అబ్దుల్ కలాం జయంతి వేడుకలు...
By Prajaswaram
On
తూప్రాన్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం ):
తూప్రాన్ సమీకృత భవనంలో గురువారం భారతరత్న, మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ... భారతదేశానికి అబ్దుల్ కలాం అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. మిస్సైల్ మ్యాన్ గా, శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశ అభివృద్ధిలో ఆయన పాత్ర అజరామరమని అన్నారు. విద్యార్థులు, యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్న ఆయన సూక్తిని ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయబ్ తహసిల్దార్ శ్రీకాంత్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ నవీన్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Latest News
15 Oct 2026 21:37:03
మెదక్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం) : మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్...


