బీఆర్ఎస్ లో చేరిన బాసుపల్లి రాంరెడ్డి....
రాంరెడ్డి కి గులాబీ కండువా కప్పిన ఎమ్మెల్యే మల్లారెడ్డి....
By Prajaswaram
On
మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన రాంరెడ్డి ..
మేడ్చల్,(ప్రజాస్వరం):
మేడ్చల్ సర్కిల్ లోని పూడూరు కిష్టాపూర్ 298 డివిజన్ కు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాసుపల్లి రామ్ రెడ్డి గురువారం మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. పూడూరు కు చెందిన రామ్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి గురువారం ఉదయం బోయిన్పల్లి లోని ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసానికి వెళ్లగా ఆయనను ఎమ్మెల్యే సాగరంగా స్వాగతం పలికి గులాబీ కండువా కప్పారు. రాబోయే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పూడూర్ కిష్టాపూర్ డివిజన్లో గులాబీ జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని అన్నారు. మేడ్చల్ సర్కిల్ పరిధిలో మూడు డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తానని ఈ సందర్భంగా రామ్ రెడ్డి ఆన్నారు. పార్టీలో చేరిన అనంతరం రామ్ రెడ్డి తన అనుచరులతో కలిసి మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో నాయకులు, రాంరెడ్డి అనుచరులు పాల్గొన్నారు....
Latest News
15 Oct 2026 21:37:03
మెదక్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం) : మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్...


