ఘనంగా బతుకమ్మ సంబరాలు...
By Prajaswaram
On
మెదక్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం) :
మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, కమిషనర్ వై. నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ మహిళా సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ దుస్తుల్లో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Latest News
15 Oct 2026 21:37:03
మెదక్, అక్టోబర్ 15 (ప్రజాస్వరం) : మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణ లో గురువారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ కానుగు రాధిక, వైస్...


