జగ్గారెడ్డి స్వగృహం లో కన్నుల పండువగా గా సత్యనారాయణ స్వామి కథ, అయ్యప్ప మహా పడి పూజ

పూజలో పాల్గొన్న దంపతులు జయా-గుణ., దత్తు, జగ్గారెడ్డి, నిర్మల

జగ్గారెడ్డి స్వగృహం లో కన్నుల పండువగా గా సత్యనారాయణ స్వామి కథ, అయ్యప్ప మహా పడి పూజ

 

సంగారెడ్డి (ప్రజాస్వరం) :

సంగారెడ్డి పట్టణం లోని రామ్ నగర్ రామ్ మందిర్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వగృహం లో సత్యనారాయణ కథ, అయ్యప్ప మహా పడి పూజలు ఘనంగా జరిగాయి. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రతీ ఏటా డిసెంబర్ 31 న ఆనవాయితీగా ఈ పూజలను జగ్గారెడ్డి నిర్వహిస్తుంటారు. ప్రతీఏడు మాదిరిగానే ఈ సారి సైతం ఈ పూజలు కన్నుల పండుగ గా జరిగాయి. ఉదయం 10 గంటలకు సత్యనారాయణ స్వామి కథ తో ప్రారంభమయ్యే ఈ పూజ కార్యక్రమాల్లో మధ్యాహ్నము అయ్యప్ప పూజ, సాయంత్రం మొదలుకుని అర్ధరాత్రి వరకు మహా పడి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈసారి ప్రత్యేకంగా మధ్యాహ్నము యోగిని పుష్పార్చన, రుద్రాభిషేకాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ భజన బృందాల చే ఏర్పాటు చేసిన భజనలు భక్తులను అలరించాయి. ఈ పూజా కార్యక్రమాల్లో జగ్గారెడ్డి కుమార్తె , అల్లుడు జయా- గుణ లతో పాటు కుమారుడు దత్తు, జగ్గారెడ్డి, నిర్మల పాల్గొన్నారు.

Latest News

నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):   నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...
పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం 
కిష్టారెడ్డిపేటకు డివిజన్ ఏర్పాటు చేయకపోతే… ఛలో బల్దియా
మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ... 
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
వివేకానంద స్వామి జయంతి కి పిలుపు.... 
క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు