సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
సైబర్ నేరాలు రోడ్డు భద్రత ఆత్మహత్యల నిహరణపై అవగాహన కార్యక్రమం.
.ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా మోసాలపై అవగాహన కలిగి
ఎస్సై బాలరాజు
రామయంపేట. 08 ( ప్రజా సర్వం)
చిన్న చిన్న సమస్యలకు అతిగా ఆలోచించి, ఇతరులతో చర్చించకుండా ఆత్మహత్యలకు పాల్పడవద్దని రామాయంపేట ఎస్సై బాలరాజు యువతకు సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో శనివారం పోలీసు కళాబృందం మేలుకొలుపు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కళాబృందం సభ్యులు సురేందర్ హాజరయ్యారు. ఇటీవల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవైనా సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించాలని, అతిగా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని యువతకు సూచించారు. తమను నమ్ముకుని ఉన్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చవద్దని సూచించారు. యువత సెల్ ఫోన్ లకు బానిసలు కావద్దని, మద్యం, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


