బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు...

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు...

చిన్న శంకరం పేట,  ఫిబ్రవరి 25 ( ప్రజాస్వరం ):       

చిన్న శంకరంపేట మండలంలో బి ఆర్ ఎస్ కు భారీ శాఖ తగులుతుంది మండలంలోని రోజు ఒక గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి నేడు శాలిపేట గ్రామానికి చెందిన సర్పంచ్ నారాయణతో పాటు సుమారు 40 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు, పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ సందర్భంగా సర్పంచ్ నారాయణ మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గం లో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేపడుతున్న అభివృద్ధి పనులకు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని గ్రామాలు అభివృద్ధి చెందాలంటే మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనoపల్లి రోహిత్ తోనే సాధ్యమనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరుగుతుందని ఆయన తెలిపారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పనిచేస్తామని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామని పార్టీ ఇచ్చిన పనులు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.