గౌరవెళ్ళి ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం లో పాల్గోన్న  మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గౌరవెళ్ళి ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం లో పాల్గోన్న  మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్  (ప్రజాస్వరం ) : 


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్ట్ అనేక కారణాలు లీగల్ ఇష్యూస్ వల్ల చాలా కాలం నుండి ఆలస్యం అవుతుంది. హుస్నాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సిన అవశ్యకత , అవసరం పై  మా మీద పదే పదే ఒత్తిడి తీసుకొస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో,సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ  మూడు జిల్లాల కలెక్టర్ లు,రాష్ట్ర అడ్వకేట్ జనరల్, ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించాం. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో లీగల్ ఇబ్బందులు ఎలా క్లియర్ చేయాలి. అదే విధంగా ప్రాజెక్ట్ భూసేకరణ, పనుల వేగవంతం పై ఎలా ముందుకు పోవాలో చర్చించడం జరిగింది. భూసేకరణ విషయంలో ఎలా ముందుకు పోవాలో వారికి హామీ ఇవ్వడం జరిగింది. భూసేకరణ కు వెంటనే నిధులు విడుదల చేస్తామని మంత్రి అధికారులకు హామీ ఇచ్చారు.  గౌరవెల్లి ప్రాజెక్ట్ లో న్యాయ చిక్కులు ఎలా అధిగమించాలో  చర్చించడం జరిగిందని అన్నారు.బుధవారం సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉంది..సుప్రీం కోర్టు లో ఎన్విరాన్మెంట్ కేసు గెలుస్తామని నమ్మకం విశ్వాసం ఉంది.  గౌరవెల్లి ప్రాజెక్ట్ అన్ని విధాలుగా పూర్తి చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.   దేవాదుల ప్రాజెక్టు నీళ్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి రావడానికి కావల్సిన పెండింగ్ పనులు పూర్తిచేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు.

Latest News

నా  పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు:కెటిఆర్ నా  పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదు:కెటిఆర్
హైదరాబాద్ ఫిబ్రవరి 23 (ప్రజాస్వరం) :  నా   పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. తన...
రాబోవు రోజుల్లో మరింత శ్రమిస్తే జాతీయ స్థాయిలోను రాణించగలం
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ వార్షిక క్రీడా పోటీలను ప్రారంభించిన పోలీస్ కమిషనర్
కుమ్మెర జాతర ఘటనపై బీఆర్ఎస్ స్పందన
గౌరవెళ్ళి ప్రాజెక్ట్ పై సమీక్షా సమావేశం లో పాల్గోన్న  మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
రజకులపై దాడి చేసిన నిందితులని తక్షణమే అరెస్టు చేయాలి