బెట్టింగ్ యాప్ లను ప్రచారం చేసిన క్రికెటర్ లపై సీపీ సజ్జనార్ ఆగ్రహం
By Prajaswaram
On
అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? : సిపి సజ్జనార్
హైదరాబాద్ నవంబర్ 7 ( ప్రజాస్వరం ) :
బెట్టింగ్ మహమ్మారికి ఎందరో యువకులు బలవుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ వల్ల యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్ పై సిపి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శ ఆటగాళ్లు ఎలా అవుతారు? అని బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేసిన సెలబ్రెటీలు బాధ్యులు కారా? అని ప్రశ్నించారు. బెట్టింగ్ వల్ల వేలమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News
18 Nov 2025 18:20:20
మేడ్చల్:(ప్రజా స్వరం) : డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మేడ్చల్ జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్


