యువ కౌలు రైతు.......

యువ కౌలు రైతు.......

ప్రజాస్వరం : మెదక్ , ఏప్రిల్ 15

 

కౌలుకు తీసుకున్న పొలం ఎండిపోవడంతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నారు. మెదక్ జిల్లా ముసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి గ్రామంలో సాయిబాబా(32) అనే యువరైతు రెండెకరాల పొలం కౌలుకు తీసుకుని, వరి సాగు చేస్తున్నాడు. సాగు పెట్టుబడికి దాదాపు రూ.3 లక్షలు అప్పు చేయగా, పంట చేతికొచ్చే సమయానికి ఉన్న రెండు బోర్లు అడుగంటడంతో, కళ్ళముందే ఎండిపోతున్న పంటను చూసి మనస్తాపానికి గురైయాడు. దీంతో పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.