గాంధీ విగ్రహనికి వినతిపత్రం అందచేత....
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :-
మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, వారీ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘం నాయకులు సోమవారం గ్రామంలో గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు రావెల్లి నిరంజన్ దాసు, నర్సింలు, అర్జున్ మాట్లాడుతూ దాడి జరిగి 35 రోజులు అవుతున్న నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అన్నారు.న్యాయం కోసం పోరాడుతుంటే అధికారులకు కన్పించడం లేదా అని ప్రశ్నించారు. దళితులపై దాడి చేయడం చట్ట రీత్యా నేరమని అన్నారు.దళితులపై దాడి చేసిన నిందితులు, దళితులపై బెదిరింపులకు పాల్పపడుతున్నారని అన్నరు.న్యాయం జరిగే వరకు ఉద్యమం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు ప్రవీణ్, గురుదాసు, మహేష్, గిరిప్రసాద్, మల్లేష్, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
Latest News
23 Nov 2026 14:33:52
ప్రజాస్వరం, మనోహరాబాద్ :- మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, వారీ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ...


