ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా ...
By Prajaswaram
On
ప్రజాస్వరం, మనోహరాబాద్ :-
ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా అందిస్తామని పోతారం సర్పంచ్ పుట్ట వినోద మహేందర్ అన్నారు. సోమవారం గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రారంభించారు.గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించి, ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో ప్రాముఖ్యత కలిగినదనీ కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ, వారి భవిష్యత్తుకు భద్రత కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మంద యాదగిరి, మన్నే సురేష్, చెలిమేల పవన్ గౌడ్, సంకి శ్రీకాంత్, గ్రామ కార్యదర్శి రజిత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Latest News
23 Nov 2026 14:33:52
ప్రజాస్వరం, మనోహరాబాద్ :- మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దళితులపై దాడి చేసిన గ్రామ సర్పంచ్ మన్నే కళ్యాణ్, వారీ అనుచరులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ...


