అండగా నిలుస్తున్న సీఎం సహాయ నిధి...
మాజీ డిప్యూటీ మేయర్...
By Prajaswaram
On
ప్రజాస్వరం, జవహర్ నగర్, నవంబర్ 14:
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడు తుందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేశారు. జవహర్ నగర్ బీజేఆర్ నగర్, బాలాజీ నగర్ కు చెందిన పాలకుర్తి శివ కార్తీక్ కు రూ. 60,000 చెక్కును అందజేశారు.ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ మొత్తం ఆస్పత్రిలో చికిత్సకోసం ఆపద సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెద్ద భరోసా అని చెప్పారు. సహాయం అందడంతో శివ కార్తీక్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి, మాజీ డిప్యూటీ మేయర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో. సీనియర్ నాయకులు, మెట్టు వెంకన్న, కుటుంబ సభ్యులు, పాలకుర్తి పార్థసారథి నాయకులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
14 Nov 2026 11:44:14
ప్రజాస్వరం, జవహర్ నగర్, నవంబర్ 14: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడు తుందని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ


