సీఎం ను కలిసిన నీలం మధు 

సీఎం ను కలిసిన నీలం మధు 

పటాన్ చెరు (ప్రజా స్వరం) : 

సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు నూతన సంవత్సర శుభాకాంక్షలు

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి శ్రీ నీలం మధు ముదిరాజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

గురువారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి

పుష్పగుచ్ఛం అందజేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా పటాన్‌చెరు ప్రాంతంలో

రెండు జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయాలు,

రెండు నూతన పోలీస్ స్టేషన్ల మంజూరుకు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీలం మధు కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే రాబోయే రోజుల్లో డివిజన్ల అభివృద్ధికి,

నూతన మున్సిపాలిటీలకు తగిన నిధులు మంజూరు చేయాలని సీఎంను విజ్ఞప్తి చేశారు.

మెదక్ పార్లమెంట్ పరిధిలో జరగనున్న మున్సిపల్, స్థానిక సంస్థలు, జిహెచ్ఎంసి ఎన్నికల్లో

కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా కష్టపడి పని చేయాలని

నీలం మధుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.

దీనికి స్పందించిన నీలం మధు,

మెదక్ పార్లమెంట్ పరిధిలో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా

అందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని సీఎంకు హామీ ఇచ్చారు.

Latest News

నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):   నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...
పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం 
కిష్టారెడ్డిపేటకు డివిజన్ ఏర్పాటు చేయకపోతే… ఛలో బల్దియా
మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ... 
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
వివేకానంద స్వామి జయంతి కి పిలుపు.... 
క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు