విద్యార్థులకు రూ.7 వేల విలువైన స్టీల్ ప్లేట్ల వితరణ...

విద్యార్థులకు రూ.7 వేల విలువైన స్టీల్ ప్లేట్ల వితరణ...

గజ్వేల్ నవంబర్ 25 (ప్రజాస్వరం):- 

 

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చాంద్ ఖాన్ మక్తలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా రూ.7 వేల విలువైన స్టీల్ ప్లేట్లను వితరణ చేశారు. గతంలో మాదారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన కీర్తిశేషులు చేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థం శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ సంయుక్తంగా ప్లేట్లను అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సజనిత బిక్షపతి రెడ్డి, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు కనకరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతోందని, ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఆరోగ్యానికి హానికరమని పేర్కొన్నారు. విద్యార్థులంతా స్టీల్ ప్లేట్లను ప్రతిరోజూ శుభ్రంగా కడిగి వినియోగించాలని సూచించారు.అనంతరం సర్పంచ్ సజనిత బిక్షపతి రెడ్డి మాట్లాడుతూ.. నేటి రోజుల్లో సొంత కుటుంబ సభ్యులనే గుర్తుంచుకోవడం కష్టంగా మారిన పరిస్థితుల్లో, తోటి ఉపాధ్యాయుడిని స్మరించుకుంటూ ఆయన జ్ఞాపకార్థం విద్యార్థులకు రూ.7 వేల విలువైన ప్లేట్లు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి. ప్రశాంత్ కుమార్, ఉపాధ్యాయులు సుమన్, గ్రామ సర్పంచ్, విద్యార్థులు పాల్గొన్నారు.

Latest News

విద్యార్థులకు రూ.7 వేల విలువైన స్టీల్ ప్లేట్ల వితరణ... విద్యార్థులకు రూ.7 వేల విలువైన స్టీల్ ప్లేట్ల వితరణ...
గజ్వేల్ నవంబర్ 25 (ప్రజాస్వరం):-    మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చాంద్ ఖాన్ మక్తలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం చేసేందుకు వీలుగా రూ.7 వేల విలువైన...
గాంధీ విగ్రహనికి వినతిపత్రం అందచేత....
ప్రతి ఇంటికి ఇందిరమ్మ బీమా ...
అన్నదానం లో అందరు భాగస్వాములు కావాలి ...
అండగా నిలుస్తున్న సీఎం సహాయ నిధి...
ఓం శ్రీ మాత్రే నమః స్మరణ పుస్తకం పూర్తి చేసిన పిట్టల సాయేందర్‌కు సన్మానం...
ఘనంగా బతుకమ్మ సంబరాలు...