కాళ్లకల్ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.....

కాళ్లకల్ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.....

 ప్రజాస్వరం, మనోహరాబాద్ :

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామం లో శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిమానికి యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ నిర్వహించారు. పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆయా పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు, యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు.