గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధర.

రెండు రోజులు తగ్గితే.. మరో మూడు రోజులు భారీగా పెరుగుతోంది బంగారం ధర. గోల్డ్ లవర్స్‌కి షాక్ ఇస్తూ.. ఇప్పుడు మరోసారి గోల్డ్ రేట్స్‌ పైపైకి ఎగబాకాయి. గత మూడు రోజుల్లో సుమారు రూ. 550 మేరకు తగ్గిన బంగారం ధర.. గురువారం ఏకంగా రూ. 200 వరకు పెరిగింది. దీన్ని బట్టి చూస్తే పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోందన్న లెక్క. పెరిగిన గోల్డ్ రేట్‌తో దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరల్లో తేడా కనిపిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు మాత్రం సమానంగా ఉన్నాయి. ఇక ఇలా భారీగా పెరుగుతోన్న బంగారం ధరలు చూసి.. పసిడిని కొనాలంటేనే జంకుతున్నారు పసిడిప్రియులు.
సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ. 6,731గా ఉంటే.. 10 గ్రాములు(తులం) రూ. 67,310 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ విషయానికొస్తే.. గ్రాము ధర రూ. 7343గా ఉంది. 10 గ్రాములు(తులం) రూ.73 వేల 430 వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధర కొనసాగుతోంది.Today Gold Rate

Latest News

మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక.... మెదక్ వైస్ చైర్మన్‌ గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి నరేష్ గౌడ్ ఎన్నిక....
మెదక్, ఫిబ్రవరి 16 (ప్రజాస్వరం):   మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 15 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా మెదక్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దొంతి...
మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన తుప్రాన్ నూతన పాలకవర్గ సభ్యులు ...
రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం...
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం...
తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ కైవసం... 
కార్యకర్త కూతురు పెళ్ళికి ఆర్థిక సహాయం... 
మెదక్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం.....