జొమాటో స్విగ్గీల్లో మద్యం డెలివరీ

జొమాటో స్విగ్గీల్లో మద్యం డెలివరీ
మద్యం ప్రియులకు ఫుడ్ డెలివరీ యాప్లు కిక్కిచ్చే విషయం చెప్పాయి. జొమాటో (Zomato), స్విగ్గీ(Swiggy), బిగ్ బాస్కెట్ (BigBasket) వంటి యాప్ లు త్వరలో బీర్, వైన్, లిక్కర్ వంటి తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ ను హోం డెలివరీ చేయనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల వచ్చే లాభనష్టాలు అంచనా వేసి అమల్లోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
డిల్లీ, కర్ణాటక, హరియాణా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ వంటి రాష్ట్రాల్లో దీనిని పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమబెంగాల్లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతి ఉంది. దీనిద్వారా ఆన్లైన్ డెలివరీల అమ్మకాలు 20-30శాతం పెరిగాయని రిటైల్ పరిశ్రమ అధికారులు తెలిపారు.
మహానగరాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడం, మద్యం దుకాణాలకు వచ్చి కొనుగోలు చేయలేని వారికోసం ఇలాంటి సౌకర్యం కల్పించాలని నిర్ణయించుకున్నామని ఎగ్జిక్యూటివ్ అధికారి పేర్కొన్నారు. దీనికి వయసు ధ్రువీకరణ, ఆన్లైన్ మోడ్ లావాదేవీలు, టైమింగ్స్ వంటి నియమాలు ఉంటాయని స్విగ్గీ ఉన్నతాధికారి వెల్లడించారు.
కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో మహారాష్ట్ర, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, అస్సాంలలో కొన్ని పరిమితులతో తాత్కాలికంగా మద్యం డెలివరీకి అక్కడి ప్రభుత్వాలు అనుమతించాయి. బెంగాల్లోని పబ్ చైన్ ది బీర్ కేఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాహుల్ సింగ్ మాట్లాడుతూ "ఆన్లైన్లో మద్యం హోం డెలివరీలను ప్రారంభించడం ద్వారా, రాష్ట్రాలు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాన్ని అందించగలుగుతాయి. ఆర్థిక వృద్ధి పెరుగుతుంది. నియమాలను, నియంత్రణను పాటిస్తూ మద్యపాన పంపిణీ చేయగలగాలి" అని తెలిపారు.zomato

Related Posts

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....