వరద ఉదృతితో ఏడుపాయల ఆలయం ముసివేత
ఏడుపాయల ఆలయం మూసివేత..
రాజగోపురం ఉత్సవ విగ్రహానికి పూజలు.
మెదక్ ఆగస్టు 14 (ప్రజా స్వరం)
వన దుర్గా ప్రాజెక్టు మంజీరా నదీ పొంగిపొర్లుతున్నడడంతో ఏడుపాయల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం నాగసాన్ పల్లి గ్రామంలోని ఏడుపాయల వన దుర్గా మాత ఆలయం జలదిగ్బంధంలో మారింది. సింగూరు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని అధికారులు వదలడంతో వన దుర్గామాత ఆలయ సమీపంలో ఆనకట్ట పూర్తిగా నిండి పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వన దుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న నదీ పాయ ఉధృతంగా ప్రవహిస్తుంది. ముందు జాగ్రత్తగా గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి భక్తులకు వన దుర్గమ్మ దర్శనం కల్పిస్తున్నారు. వరద ఉధృతి తగ్గు ముఖం పట్ట గానే మూలవిరాట్ అమ్మవారి దర్శనం యధావిధిగా కొనసాగుతుందని ఆలయ ఈవో చంద్రశేఖర్ పేర్కొన్నారు