కొడుకును చంపిన తల్లి
తూప్రాన్, ఆగస్టు 15,ప్రజాస్వరం
ఓ కన్నతల్లి కొడుకును చంపిన సంఘటన లో తల్లితోపాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తూప్రాన్ మండలం వెంకటాయపల్లి కి చెందిన అహ్మద్ పాషా (25) తండ్రి మృతి చెందడంతో తన తల్లి రహేనాతో కలిసి ఉండేవాడు. అహ్మద్ పాషా తండ్రి మరణించడంతో తన తల్లి రహేన మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కందల బిక్షపతితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొడుకు అహ్మద్ పాషా కు తల్లి రెహనాకు ఈ విషయమై పలుమార్లు గొడవలు జరిగాయి. రహేన బిక్షపతి ల వివాహేతర సంబంధానికి కొడుకు అహ్మద్ పాషా అడ్డుగా ఉన్నాడని ఎలాగైనా తన కొడుకును చంపాలని రెహనా నిర్ణయించుకుందన్నారు. ప్లాన్ ప్రకారం అహ్మద్ పాషా ను తల్లి రెహనా బిక్షపతి తో కలిసి ఆబోతుపల్లి శివారులోని చెక్ డాం వద్దకు తీసుకెళ్లింది. అక్కడికి వెళ్ళాక మద్యం తాగించి తాడుతో చున్నీలతో గొంతు కు బిగించి హత్య చేశారు. అహ్మద్ పాషా మరణించాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత అతని డెడ్ బాడీని చెక్ డ్యామ్ లోని నీటిలో పడేశారన్నారు. ఎటువంటి ఆధారాలు దొరక్కపోయినా నేరస్తులను గుర్తించి కేసు చేదించినందుకు తూప్రాన్ సిఐ రంగాకృష్ణ, ఎస్సై శివానందం తో పాటు పోలీస్ సిబ్బందిని డిఎస్పి అభినందించారు.