దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్....
ఈ వ్యక్తి పై గతం లోనే 10, ఒక పోక్సో కేసులు... 
మద్యం, విలాసవంతమైన జీవితం కోసమే దోపిడీలు...

జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు.

మెదక్ ఆగస్టు 14 (ప్రజా స్వరం)

ఈ నెల 13 న ఒక మహిళపై దాడి చేసి తులం చెవి రింగులు దోపిడి చేసిన ఘటన లో నిందితుడిని పోలీసులు 24 గంటల్లో పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. గురువారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితుడు గజ్జల బిక్షపతి మద్యం, జూదం వంటి వ్యసనాలకు బానిస కావడమే కాక విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి దోపిడీలకు పాల్పడుతున్నాడని అన్నారు. గతంలో పలు నేరాల్లో అరెస్టే మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన 3 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుని రెండో భార్యతో గుమ్మడిదలలో నివసిస్తున్నాడని అన్నారు. ఈ వ్యక్తి పై ఇప్పటికే 10 దోపిడి ల్లో, ఒక పోక్సో కేసు లో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. ఇటీవలే గుమ్మడిదల నేరాల్లో అరెస్ట్ అయి ఈ నెల 11 న కంది జైలు నుండి బయటకు వచ్చాడని అన్నారు. ఈ నెల 13 న పాత కేసుల విషయంలో మెదక్ లో ఓ న్యాయవాదిని కలిసి తిరిగి గుమ్మడిదల వస్తున్న క్రమంలో బస్ లో మహిళతో పరిచయం చేసుకుని ఆమె కు మద్యం, చేపలు, డబ్బు ఇస్తానని మోసపూరిత మాటలు చెప్పడం జరిగిందని అన్నారు. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఆమె కు మద్యం సేవిపజేసి మత్తులో ఉన్న సమయంలో ఆమె పై రాయితో దాడి చేసి చెవి రింగులు లాక్కొని పరారీ అయ్యాడని అన్నారు. బాధిత మహిళ పిర్యాదు మేరకు నర్సాపూర్ పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి 24 గంటల్లో నిందుడిని గుమ్మడిదల సమీపంలో పట్టుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ బి. లింగం, కానిస్టేబుల్స్ శ్రీకాంత్ బృందం ను అభినందించి, రివార్డులు అందజేశారు.

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..