ఉప్పల్ వేదికగా..

బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

ఉప్పల్ వేదికగా..

హైదరాబాద్ :

బంగ్లాదేశ్‌తో  హైదరాబాద్‌ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్‌తో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 297 పరుగులు సాధించగా  భారీ లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది.  అత్యధికంగా 133 పరుగుల తేడాతో గెలిచిన భారత్ గెలిచింది.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా 20 ఓవర్లలో 297 పరుగులు చేసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించారు.  సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి అవుట్ కాగా  కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్-సంజూ శాంసన్ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 173 పరుగుల భాగస్వామ్యాన్ని చేశారు.   చివరిలో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. దీంతో భారత్ ఈ రికార్డు స్థాయి లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది.గతంలో 104 పరుగుల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా రికార్డును భారత్  బద్దలు కొట్టింది. హైదరాబాద్ టీ20లో సంజూ శాంసన్ విధ్వంసంతో టీమిండియా రికార్డు విజయం సాధ్యమైంది. టీ20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగానమోదైంది. టీ20 ప్రపంచ కప్ 2022లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడా గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బద్దలు కొట్టింది. 

బంగ్లాపై అత్యధిక పరుగుల తేడాతో విజయాలు
1. భారత్ -133 పరుగులు (2024)
2. దక్షిణాఫ్రికా - 104 పరుగులు (2022)
3. పాకిస్థాన్‌ - 102 పరుగులు (2008)
4. భారత్ - 86 పరుగులు (2024)
5. దక్షిణాఫ్రికా- 83 పరుగులు (2017) 

Latest News

నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ....
జాతీయ స్థాయి కరాటే పోటీలలో నితన్య సిరి ప్రతిభ....నితన్య సిరి ని అభినందించిన జిల్లా ఎస్పీ.... మెదక్ ఆగస్టు 30 (ప్రజా స్వరం) జాతీయ స్థాయి కరాటే...
సమయపాలని పాటించని ఉద్యోగులపై మెదక్ కలెక్టర్ కొరడా 
పగడ్బందీగా గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు : మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
బీజేపీలో భారీగా చేరికలు  
ప్రభుత్వ సహాయక చర్యలు అంతంత మాత్రమే : ఎంపీ రఘునందన్ రావు....
సహాయక చర్యల్లో జిల్లా పాలన యంత్రాంగం తీరు అభినందనీయం : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
బీజేపీ జిల్లా నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రం అందజేత..