Breaking: యంగ్ టైగర్ కు యాక్సిడెంట్..

మణికట్టు,వేళ్లకు తీవ్ర గాయాలు

116655671

జూబ్లీహిల్స్ లో గత అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో యువ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురయింది. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ముప్పేమీ లేదని తేలడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎడమచేతి మణికట్లు కు గాయమైనట్లు వైద్యులు చెబుతున్నారు. కొద్దిగా వేళ్లకు కూడా దెబ్బతగలిందన్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కోలుకుంటున్నారు గత రాత్రే తాను నటించిన దేవర మూవీకి సంబంధించిన ఓ అప్ డేట్ ను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంపారు.

నందమూరి కుటుంబానికి యాక్సిడెంట్ల గండం ఉన్నట్లు గతంలో జరిగిన సంఘటనలు రుజువుచేస్తున్నాయి. అప్పట్లో నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో మరణించగా తండ్రి హరి కృష్ణ కూడా అదే తరహాలో రోడ్డు యాక్సిడెంట్ కు గురై మృతిచెందారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ రామ్ తమ సొంత బ్యానర్ లో రూపొందే సినిమాలకు ముందు మాటగా కారు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఓ మెసేజ్ కూడా ఇస్తున్నారు. హరికృష్ణ మరణానంతరం అన్నదమ్ములిద్దరూ కలిసి ఇలాంటి మెసేజ్ తమ బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ముందు ప్రకటిస్తూ అందరినీ అప్రమత్తం చేస్తూ వస్తున్నారు.

Related Posts

Latest News

మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు... మేడ్చల్ గడి మైసమ్మ ఆలయంలో వైభవంగా నవరాత్రి ఉత్సవాలు...
ప్రజాస్వరం,మేడ్చల్ : మేడ్చల్ పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ గడి మైసమ్మ తల్లి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు...
రైతులకు 12 గంటల వ్యవసాయ విద్యుత్ ఇవ్వాలి....
ఆర్యవైశ్య సంఘం సామాజిక సేవ అభినందనీయం...
భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా గున్న సంధ్య...
ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
బాలమ్మ సేవలను ఆదర్శంగా తీసుకోవాలి....
ఘనంగా గాయత్రోత్సవ్ 2 కే 26  ....