పిడుగు పాటుకు ఇద్దరు... మెదక్ జిల్లాలో ఘటన

తూప్రాన్ / 

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాల్ పల్లి గ్రామంలో శనివారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయాల పాలై న సంఘటన శనివారం చోటు చేసుకుంది. వెంగళి ప్రసాద్ (15), నడిపల్లి యశ్వంత్ (13), పుల్ల కిరణ్ లు ఆడుకుంటుండగా వర్షం రావడం తో అక్కడ వున్న చెట్ల కిందకు వెళ్లారు.వర్షం తో పాటు పిడుగు పడడం తో ప్రసాద్, యశ్వంత్ లు అనే ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా కిరణ్  కు గాయాలు అయ్యాయి. గాయాల పాలైన కిరణ్ కు తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.IMG-20250517-WA0001

Latest News