బొల్లిపల్లి తిరుపతిరెడ్డిని సత్కరించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
By Prajaswaram
On
బొల్లిపల్లి తిరుపతిరెడ్డిని సత్కరించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
వర్గల్ / మనోహరాబాద్ , మే 9 (ప్రజాస్వరం ) : వర్గల్ మండల బీజేపీ నూతన అధ్యక్షులుగా నియామకమైన బొల్లిపల్లి తిరుపతిరెడ్డిని మెదక్ ఎంపీ రఘునందన్ రావు శాలువా వేసి సత్కరించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేలా చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు. ఈ సందర్భాంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధిష్టానం తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్ష పదవి అప్పగించినందుకు కృత జ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యున్నతికి కృషి చేసి పార్టీని మరింత బలమైన పార్టీగా తీర్చిదిద్దుతానని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ సూచనలు తీసుకొని పార్టీ పెద్దలు, నాయకులు , బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తల సహకారంతో ముందుకెళ్తానని వెల్లడించారు.
Latest News
17 May 2025 19:00:48
తూప్రాన్ / మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని పడాల్ పల్లి గ్రామంలో శనివారం పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందగా ఒకరు గాయాల పాలై న సంఘటన...