ఇప్పుడే సినిమా స్టార్ట్ ఉగ్రస్థావరాలపై దాడి అద్భుతం _ ఆర్మీ మాజీ చీఫ్‌ల కీలక వ్యాఖ్యలు
ఇప్పుడే సినిమా స్టార్ట్
ఉగ్రస్థావరాలపై దాడి అద్భుతం
దాడులు కొనసాగించాలి
ఆర్మీ మాజీ చీఫ్‌ల కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నరవణే కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు మాజీ చీఫ్‌ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి మాట్లాడుతూ.. ఉగ్రస్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఆపకూడదని.. కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని.. ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని అన్నారు. దాడుల సమయంలో మాజీ ఆర్మీ చీఫ్‌ల నుంచి ఈతరహా స్పందన రావడం గమనార్హం. కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విలేకరులతో మాట్లాడారు. కోట్లీలోని గుల్పూర్ టెర్రర్ క్యాంప్‌పై ఎలా దాడి చేశామనేది సోఫియా ఖురేషి వీడియో ప్రదర్శించారు. ఇక్కడే గతంలో ‘ఫూంచ్’ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు శిక్షణ తీసుకున్నారంటూ పేర్కొన్నారు.