సైన్యంతో మనం _ సీఎం రేవంత్‌రెడ్డి
సైన్యంతో మనం
ఈ సమయంలో రాజకీయాలకు తావులేదు
అత్యవసర ఉద్యోగుల సేవలు రద్దు
మంత్రులు, అధికారులు అందుబాటులో తస్పనిసరి
రేపు సాయంత్రం 6 గంటలకు సంఘీభావ ర్యాలీ
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్:ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలిపారు. బుధవారం ఉదయం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులందరూ అందుబాటులో ఉండాలన్నారు. మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్‌ఫ్రీ నంబర్ సిద్ధం చేయాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించనున్నారు. నగరంలోని సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఇది కొనసాగనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.