అంతర్జాతీయం - Prajaswaram Daily

భూమికి దగ్గరగా చంద్రుడు
భూమికి దగ్గరగా చంద్రుడు
కను విందు చేయనున్న "సూపర్ మూన్"
మన దేశం లో మూడు రోజుల పాటు సూపర్ మూన్ (నీలి రంగు)లో భారీ సైజు లో చంద్రుడు కనిపించనున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) వెల్లడించింది. ఆదివారం నుంచి బుధవారం వరకు సూపర్ మూన్ దర్శమివ్వనుండగా భారత్ లో రేపు సోమవారం నాడు సూపర్ మూన్ కనువిందు చేయనుంది. నీలి రంగులో చంద్రుడు భారీ సైజులో దర్శనమివ్వనున్నాడని తెలిపింది. ఈ సూపర్ మూన్ నేటి ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు వివిధ దేశాల్లో వేర్వేరు సమయాల్లో చూడొచ్చని తెలిపింది.  మంగళవారం ఉదయం సూపర్ మూన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుందని నాసా వివరించింది.ఈ ఏడాది ఇదే తొలి సూపర్ మూన్ కాగా... భారత్ లో ఆగస్టు 19 రాత్రి నుంచి ఆగస్టు 20 ఉదయం వరకు కనిపిస్తుంది. కాగా, సూపర్ మూన్ అనే పదాన్ని రిచర్డ్ నోలీ అనే ఖగోళ శాస్త్రవేత్త 1979లో మొదటిసారిగా ఉపయోగించారు. పౌర్ణమి వేళల్లో చంద్రుడు భూమికి 90 శాతం అత్యంత చేరువగా వచ్చినప్పుడు దాన్ని సూపర్ మూన్ అని పిలుస్తారు. సాధారణ పౌర్ణమి వేళల్లో కంటే, సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత భారీ పరిమాణంలో కనిపిస్తాడని నాసా పేర్కొంది.

వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌
వినేశ్‌ ఫొగాట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌..
- ఢిల్లీ ఎయిర్‌పోర్ట్​‌కు భారీగా చేరుకున్న అభిమానులు
- కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్‌ ఫోగట్‌
ప్రజా స్వరం, నేషనల్ ​బ్యూరో : భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్నారు. శనివారం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యారు. ఈ సందర్భంగా రెజ్లర్‌ వినేశ్ ఫొగాట్‌కు గ్రాండ్ వెల్‌కమ్ స్వాగతం లభించింది. పారిస్‌లో జరిగిన  ఒలింపిక్స్‌ క్రీడల్లో వినేశ్‌పై అధిక బరువు కారణంగా అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. 50 కిలోల  విభాగంలో వంద  గ్రాములు అధిక బరువు ఉందన్న కారణంగా ఫైనల్‌కు కొన్ని క్షణాల ముందు రెజ్లర్‌పై అనర్హత వేటు పడింది. దీంతో యావత్​ భారత దేశం తీవ్ర నిరాశ చెందింది. ఇక తన ‘అనర్హత వేటు’పై కోర్టు ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌(కాస్‌)ను వినేశ్‌ ఆశ్రయించగా, అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నెల 16న తీర్పు వెలువరించాల్సి ఉన్నా 14వ తేదీ రాత్రి ఉన్నఫళంగా ఆమె పిటిషన్‌ను కొట్టేస్తున్నట్టు ప్రకటించడం భారత క్రీడాభిమానులను నివ్వెరపోయేలా చేసింది. కారణాలేమీ చెప్పకుండానే ‘సింగిల్‌ లైన్‌ ఆర్డర్‌’తో కాస్‌ వెలువరించిన ప్రకటన అనంతరం ఆమెకు పలువురు క్రీడాకారులు మద్దతుగా నిలిచారు. ఈ పరిణామాల అనంతరం వినేశ్‌ తొలిసారి భారత్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మద్దతుగా పెద్దఎత్తున అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ వద్దకు వెళ్లారు. వారిని చూసిన వినేశ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.

18,000 మంది ఉద్యోగులను తొలగిస్తాం.. ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన
అమెరికా చిప్‌ల తయారీ దిగ్గజం ఇంటెల్ కంపెనీ సంచలన ప్రకటన చేసింది. కంపెనీ కార్యకలాపాల క్రమబద్ధీకరణలో భాగంగా 15 శాతానికి పైగా మంది ఉద్యోగులను తగ్గించుకోబోతున్నట్టు గురువారం వెల్లడించింది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో కంపెనీ సుమారు 1.6 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిన నేపథ్యంలో ఈ ఏడాది వ్యయాలను సుమారు 20 బిలియన్ డాలర్ల మేర కుదించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపింది. ముఖ్యమైన ఉత్పత్తి, ప్రాసెస్ టెక్నాలజీ పరంగా లక్ష్యాలను చేరుకున్నప్పటికీ రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక పనితీరు నిరాశాజనకంగా ఉందని ఆ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాట్ గెల్సింగర్ తెలిపారు. ఆర్థిక సంవత్సరం రెండవ అర్ధభాగంలో పరిస్థితులు మరింత సవాళ్లతో కూడి ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పారు.

కాగా ఇంటెల్ కంపెనీలో గత ఏడాది చివరి నాటికి 124,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 15 శాతం మందిని తొలగిస్తే దాదాపు 18,000 మందిపై ప్రభావం పడొచ్చని అంచనాగా ఉంది. ప్రత్యర్థులు ఎన్వీడియా, ఎఎమ్‌డి మరియు క్వాల్‌కామ్‌ల నుండి బలమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఇంటెల్ ధిక్కరించిన ఒక నెల తర్వాత బెల్ట్-బిగింపు వచ్చింది, కృత్రిమ మేధస్సు విప్లవానికి దారితీస్తుందని సాంకేతికతలను ఆవిష్కరించింది.

ఇంటెల్‌కు గట్టి పోటీ!
కొన్ని దశాబ్దాలపాటు ల్యాప్‌టాప్‌ల నుంచి డేటా సెంటర్‌ల వరకు ఇంటెల్ చిప్‌ల ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ మధ్యకాలంలో ఆ కంపెనీకి పోటీ పెరిగిపోయింది. ఎన్వీడియా, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్‌ల నుంచి ఆ కంపెనీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఏఐ ప్రాసెసర్‌ల మీద ప్రత్యేక దృష్టిసారించిన ఎన్వీడియా నుంచి ఇంటెల్ కంపెనీకి మార్కెట్‌లో పోటీ ఎదురవుతోంది.

అప్పుల నుంచి ఊరట! భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడి కృతజ్ఞతలు
రుణాల చెల్లింపులో వెసులుబాటు కల్పించిన భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు ముహమ్మద్ ముయిజ్జు తాజాగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇరు దేశాల బంధం మరింత బలోపేతం కావాలని అభిలషించారు. రెండు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదరాలని కూడా ఆకాంక్షించారు. మాల్దీవుల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ అధికారిక కార్యక్రమంలో ముయిజ్జు ప్రసంగించారు. గత ఎనిమిది నెలల్లో తాము దౌత్య పరంగా మంచి విజయాలు అందుకున్నామన్నారు. మాల్దీవులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రుణాల చెల్లింపుల్లో భారత్‌, చైనాలు వెసులుబాటు కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో డాలర్ల కొరతను తగ్గించేందుకు ఇరు దేశాలతో కరెన్సీ మార్పిడి ఒప్పందాలపై చర్చిస్తున్నట్టు కూడా తెలిపారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని, భారత్‌తో కూడా ఇలాంటి ఒప్పందం కుదరాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

చైనా అనుకూలుడిగా పేరున్న ముయిజ్జు గద్దెనెక్కాక భారత్‌-మాల్దీవుల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లోని భారత సైనిక దళాలను వెనక్క పంపించడమే ప్రధాన ఎజెండగా ఎన్నికల్లో ప్రచారం చేసి ముయిజ్జు ఘన విజయం సాధించారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన రాజీమార్గం పట్టారు. మోదీ ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు.

మాల్దీవుల ప్రభుత్వం గతంలో భారత్‌ నుంచి పలుమార్లు భారీ రుణాలు తీసుకుంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రుణాల చెల్లింపులపై వెసులుబాటు కల్పించాలని భారత్‌ను అభ్యర్థించింది. మాల్దీవుల మీడియా ప్రకారం, గతేడాది చివరి నాటికి మాల్దీవులు భారత్‌కు 6.2 బిలియన్ల మాల్దీవుల రుఫియాలు బాకీ ఉంది. పరపతి విధానంలో మార్పులు చేయకపోతే రుణాల ఒత్తిడి పెరిగి ఇబ్బందులు మొదలవుతాయని మాల్దీవులను అంతర్జాతీయ ద్రవ్యనిధి ఈ ఏడాది మొదట్లోనే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారత్ కల్పించిన వెసులుబాటుపై ముయిజ్జు ధన్యవాదాలు తెలిపారు. భారత్, మాల్దీవులను సన్నిహిత మిత్రదేశాలుగా అభివర్ణించిన ఆయన ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని వ్యాఖ్యానించారు.

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ప్ర‌ధాని మోదీ
పొరుగు దేశం పాకిస్థాన్‌కు ప్ర‌ధాని మోదీ(PM Modi) వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ 25వ కార్గిల్ విజ‌య్ దివ‌స్ సంద‌ర్భంగా ద్రాస్ సెక్టార్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నేరాల‌కు పాల్ప‌డి గ‌తంలో విఫలం అయ్యింద‌ని, కానీ ఆ చ‌రిత్ర నుంచి ఆ దేశం ఏమీ నేర్చుకోలేద‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్ర‌వాదం, ప్ర‌చ్ఛ‌న్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోంద‌ని విమ‌ర్శించారు. తాను మాట్లాడే ప్ర‌దేశం నుంచి ఉగ్ర‌దాడుల‌కు పాల్ప‌డుతున్న ముఠా నేత‌లు త‌న స్వ‌రాన్ని నేరుగా వింటార‌ని, ఉగ్ర‌వాదానికి ఊతం ఇస్తున్న దేశాల‌కు ఓ విష‌యాన్ని చెప్ప‌ద‌లుచుకున్నాన‌ని, ఆ దేశ కుంచిత ఆలోచ‌న‌లు ఎన్న‌టికీ విజ‌యవంతం కావు అని ప్ర‌ధాని తెలిపారు. పూర్తి స్థాయి ద‌ళాల‌తో ఉగ్ర‌వాదుల్ని మా సైనికులు అణిచివేస్తార‌ని, శ‌త్రువుకు బ‌ల‌మైన స‌మాధానం ఇస్తామ‌ని ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు.

ల‌డాఖ్ అయినా, జ‌మ్మూక‌శ్మీర్ అయినా, అభివృద్ధికి అడ్డు వ‌చ్చే ఎటువంటి స‌వాల్‌ను అయినా ఇండియా ఓడిస్తుంద‌ని మోదీ అన్నారు. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసి ఆగ‌స్టు 5వ తేదీ నాటికి అయిదేళ్లు అవుతుంద‌ని, జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు కొత్త భ‌విష్య‌త్తు, కొత్త క‌ల‌ల గురించి మాట్లాడుకుంటున్నార‌ని తెలిపారు. మౌళిక స‌దుపాయాల అభివృద్ధి, ప‌ర్యాట‌క రంగం.. ల‌డాఖ్‌, జేకేలో వేగంగా వృద్ధి చెందుతోంద‌న్నారు. క‌శ్మీర్‌లో కొన్ని ద‌శాబ్ధాల త‌ర్వాత సినిమా హాల్‌ను ఓపెన్ చేసిన‌ట్లు చెప్పారు. 35 ఏళ్ల త‌ర్వాత శ్రీన‌గ‌ర్‌లో తాజియా ఊరేగింపు జ‌రిగింద‌న్నారు.

#WATCH | Ladakh: PM Narendra Modi says, "Pakistan has failed in all its nefarious attempts in the past. But Pakistan has not learned anything from its history. It is trying to keep itself relevant with the help of terrorism and proxy war. Today I am speaking from a place where… pic.twitter.com/HQbzjcVKVq

— ANI (@ANI) July 26, 2024

సైబర్ దాడుల విషయంలో బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలి RBI
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ దాడుల దృష్ట్యా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు తమ ఐటి సిస్టంలపై నిఘాను హైలెవల్ లో మెయిన్ టైన్ చేయాలని భారత రిజర్వు బ్యాంకు(ఆర్ బిఐ) గవర్నర్ శక్తికాంత దాస్ శనివారం తెలిపారు. డిజిటల్ మోసాలు మోసాలు పెరుగుతున్నాయని కూడా ఆయన హెచ్చరించారు. మ్యూట్ బ్యాంక్ అకౌంట్స్ విషయంలో కూడా మోసాలు పెరుగుతున్నాయన్నారు.  థర్డ్ పార్టీ రిస్క్ లను తగ్గించుకోవాలన్నారు.

సమస్యను పరిష్కరించాం... ఇలా చేయండి!: మైక్రోసాఫ్ట్
విండోస్‌లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజం ప్రతినిధులు తెలిపారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య సైబర్ సెక్యూరిటీ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

క్రౌడ్ స్ట్రయిక్ సంస్థ ఇచ్చిన కొత్త అప్ డేట్ కారణంగా బ్లూ స్క్రీన్‌పై ఎర్రర్ వచ్చినట్లు తెలిపింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అని వెల్లడించింది. సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో సీ-సీ0000291*.sys ఫైల్‌ను తొలగించాలని సూచించింది. సేఫ్ లేదా రికవరీ మోడ్‌లో ఓపెన్ చేయాలని పేర్కొంది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే అలాంటి వారి కోసం అప్ డేట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.

మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్సర్వర్లు నిలిచిపోయాయి. దీని కారణంగా బ్యాంకుల నుండి విమానయాన సంస్థల వరకు సేవలకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా ఇండిగో, అకాసా ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్‌తో సహా అనేక విమానయాన సంస్థలు తమ విమానాలను గ్రౌండ్ చేయవలసి వచ్చింది. విమాన కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో బ్యాంకులు, స్టాక్ ఎక్స్ఛేంజీల పనితీరుపైనా ప్రభావం పడింది. చాలా మంది విండోస్ వినియోగదారులు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ఎర్రర్‌ను చూస్తున్నారు.
సర్వర్లలో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పలు కంపెనీల విమానాలు ఎగరలేకపోతున్నాయి. టికెట్ బుకింగ్ నుండి చెక్-ఇన్ వరకు సమస్యలు ఉన్నాయి. భారతదేశంలోని అనేక విమానాశ్రయాలు కూడా సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
US ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువగా ప్రభావితమైంది

మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా అమెరికా ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ఎక్కువగా ప్రభావితమైంది. ఢిల్లీ, ముంబై, బెర్లిన్, సిడ్నీ విమానాశ్రయాల్లో పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. సర్వర్ సమస్యల కారణంగా 131 విమానాలను రద్దు చేసినట్లు అమెరికా ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ ప్రకటన విడుదల చేసింది. యునైటెడ్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాలు నిలిచిపోయాయి. 200కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ లోపం కారణంగా అమెరికన్ ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ప్రభావితమైంది.

మేము నిరంతరం సేవలను మెరుగుపరుస్తున్నాము-మైక్రోసాఫ్ట్

ఇదిలా ఉండగా, సర్వర్ లోపంపై మైక్రోసాఫ్ట్ నుంచి ప్రకటన వెలువడింది. నిరంతరం సేవలను మెరుగుపరుస్తున్నామని మైక్రోసాఫ్ట్ తెలిపింది. సమస్యను సరిదిద్దేందుకు అనేక బృందాలు పని చేస్తున్నాయని, ఇందుకు గల కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపింది.

ఢిల్లీ విమానాశ్రయంలో ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ లోపం కారణంగా సేవలు ప్రభావితమయ్యాయి.
డెన్మార్క్‌లో ఫైర్ అలారం పని చేయడం లేదు.
మైక్రోసాఫ్ట్ సర్వర్‌లలో లోపం కారణంగా ఆస్ట్రేలియాలో అత్యవసర సమావేశం జరుగుతోంది. ఈ లోపం కారణంగా ఆస్ట్రేలియా చెల్లింపు సేవ ప్రభావితమైంది.
అమెరికాలో 911 సర్వీస్ పని చేయడం లేదు.
దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌పై కూడా ఈ ఆందోళన నెలకొంది.

చీకటి అధ్యాయంగా 'ఎమర్జెన్సీ' గుర్తుండిపోతుంది: మోదీ
కాంగ్రెస్ 'ఎమర్జెన్సీ' నిర్ణయాన్ని యావత్ దేశం ఎప్పటికీ చీకటి అధ్యాయంగా గుర్తుంచుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 25న్ను 'రాజ్యాంగ హత్యాదివస్'గా కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. 'ఆనాడు రాజ్యాంగాన్ని కాలరాసి తర్వాత దేశం ఎదుర్కొన్న పరిస్థితులను ఈ రోజు గుర్తుకుతెస్తుంది. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతివ్యక్తికి నివాళులర్పించే రోజు జూన్ 25' అని ఆయన రాసుకొచ్చారు.

జపాన్ లో లాఫ్ రూల్...
టోక్యో, జూలై 12 :
రోజులో మీరు ఎంత సేపు నవ్వుతారు..? అసలు నవ్వుతారా..? ఈ ప్రశ్నలు చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు. కానీ మనకున్న రకరకాల ఒత్తిళ్ల నుంచి పైసా ఖర్చు లేకుండా బయటపడే మార్గం నవ్వడం మాత్రమే. అందుకే లాఫింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయండి అంటూ చాలా మంది ఎక్స్‌పర్ట్స్‌ సలహాలు ఇస్తున్నారు.

బలవంతంగా అయినా కాసేపు నవ్వుకోండి అని చెబుతున్నారు. జపాన్‌ ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసింది. "చచ్చినట్టు నవ్వాల్సిందే" అని కొత్త రూల్‌ తీసుకొచ్చింది. ఆ దేశంలో ఇప్పుడదో చట్టం కూడా అయిపోయింది. పౌరులంతా రోజుకి కనీసం ఒక్కసారైనా కచ్చితంగా నవ్వి తీరాల్సిందే. అలా చేస్తే గుండెపోటు ముప్పు తగ్గిపోతుందట. అందుకే ఇలా కండీషన్ పెట్టింది. నార్త్ జపాన్‌లో యమగర్తలో ఆర్డినెన్స్ కూడా పాస్ చేసింది ప్రభుత్వం. స్థానిక యూనివర్సిటీలో నవ్వుపై పరిశోధనలు చేసి, గుండెపోటు తగ్గిస్తుందని కన్‌ఫమ్ చేసుకున్నాకే ఈ ఆర్డినెన్స్‌ ఇచ్చారు అధికారులు. గత వారమే ఈ నిబంధన తీసుకొచ్చారు. నిజానికి ఐదేళ్ల క్రితమే ఓ హెల్త్ జర్నల్‌లో ఇందుకు సంబంధించిన ఓ ఆర్టికల్ పబ్లిష్ అయింది. "నవ్వుతో కలిగే ప్రయోజనాలు" అనే టాపిక్‌పై లోకల్‌గా యమగట యూనివర్సిటీలో రీసెర్చ్ జరిగింది.

ఇంత రీసెర్చ్ జరిగిన తరవాతే రూల్‌ తీసుకొచ్చారు. రోజుకోసారి నవ్వడం ద్వారా మానసికంగా, శారీరకంగా కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు అర్థం అవుతుందనే ఉద్దేశంతోనే ఈ నిబంధన తీసుకొచ్చినట్టు ప్రభుత్వం వివరణ ఇస్తోంది. అటు వర్క్‌ ప్లేసెస్‌లోనూ ఈ రూల్‌ని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు అందాయి. పని వాతావరణం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని తేల్చిచెప్పారు. అంతే కాదు. ప్రతి నెల 8వ రోజుని "డే ఆఫ్ లాఫ్టర్"గా జరుపుకోనున్నారు.

అయితే.. ఈ రూల్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు మంచిదే అంటుంటే మరి కొందరు ఇదేం రూల్ అని మండి పడుతున్నారు. నవ్వాలా వద్దా అన్నది వ్యక్తిగత ఇష్టమని, రాజ్యాంగం కల్పించే హక్కుని కాదని బలవంతంగా నవ్వమంటారా అని ప్రశ్నిస్తున్నారు. నవ్వడం ఎంత ముఖ్యమైనప్పటికీ కొంత మంది లోలోపలే హ్యాపీగా ఫీల్ అవుతారని, అలాంటి వాళ్లూ నవ్వాలని ఒత్తిడి తీసుకురావడం సరికాదని వాదిస్తున్నారు. అంతే కాదు. ఆరోగ్య కారణాల వల్ల నవ్వలేని వాళ్లకి ఈ రూల్ నుంచి మినహాయింపు ఇవ్వాలనీ అంటున్నారు.

నవ్వడం ఎంత మంచిదే అయినా ఇలా బలవంతం చేసి నవ్వించడం వల్ల ఎలాంటి ఉపయోగముండదని తేల్చి చెబుతున్నారు. అంతకు ముందు రీసెర్చ్ కోసం 17 వేల మందిపై స్టడీ చేశారు. వాళ్లందరూ ఎప్పుడెప్పుడు ఎంత సేపు నవ్వుతారో అని అడిగి తెలుసుకున్నారు. కొన్నేళ్ల పాటు వాళ్ల హెల్త్ రికార్డ్‌ని ట్రాక్ చేశారు. వారంలో కనీసం ఓసారైనా నవ్విన వాళ్లలో గుండె సంబంధిత సమస్యలు చాలా అరుదుగా కనిపించాయి. నెలకోసారి నవ్వే వాళ్లలో కొన్ని సమస్యలు కనిపించాయి. ఈ రీసెర్చ్ ఆధారంగానే ప్రభుత్వం అక్కడ నిబంధన తీసుకొచ్చింది.

భారత్ మారుతోంది..
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే మా లక్ష్యం

డిజిటల్ పేమెంట్లలో సరికొత్త రికార్డులు సృష్టించాం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం

సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి

రష్యాలో ప్రవాసభారతీయులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

అధ్యక్షుడి నివాసంలో గ్రాండ్ వెల్ కమ్ చెప్పిన వ్లాదమీర్ పుతిన్

ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రష్యా పర్యటనలో ఉన్న ఆయన  ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఒంటరిగా  రష్యాకు రాలేదని  140 కోట్ల మంది భారతీయుల ప్రేమతో వచ్చానన్నారు.  భారత్‌ జీ-20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని..డిజిటల్‌ పేమెంట్లలో సరికొత్త రికార్డ్‌లను సృష్టించామన్నారు. దేశం మరుతోందని ప్రపంచం మొత్తం గుర్తిస్తోందన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జీని నిర్మించాం..  పదేళ్లలో  ముఫ్పై వేల కిలోమీటర్ల రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్లు చేశాం ..  పదేళ్లలో ఎయిర్‌ పోర్ట్‌ల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించారు.  గత పదేళ్లలో జరిగిన అభివృద్ది ట్రైలర్‌ మాత్రమే .. అసలు అభివృద్ధి ముందు ముందు ఉంటుందన్నారు.  దేశాభివృద్దిలో 140 కోట్ల భారతీయుల కృషి ఉందని..  సవాలు..సవాళ్లు నా డీఎన్‌ఏలో ఉన్నాయి. గత పదేళ్లలో దేశంలో జరిగిన అభివృద్దిపై ప్రపంచమే ఆశ్చర్యపోయిందని గుర్తు చేశారు.  ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్‌ 15 శాతం సహకరిస్తోందన్న మోదీ.. 2014కి ముందు అంధకారంలో ఉందన్నారు. ఐసీసీ వరల్డ్ టీ20లో భారత్ విజయాన్ని మీరు ఘనంగా జరుపుకున్నారు. విజయమే అంతిమ లక్ష్యం. భారత యువత చివరి క్షణం వరకు పట్టు వదలరని ప్రశంసించారు.  ప్రతి భారతీయుడు దేశాన్ని మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారతదేశ విజయాల గురించి ఎన్నారైలు గర్వంగా మాట్లాడుతున్నారని..  ఈ రోజు భారత్‌ చంద్రుని భాగంలోకి చంద్రయాన్‌ పంపింది. మరే ఇతర దేశం ఆ స్థాయికి చేరుకోలేదని గుర్తు చేశారు  ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ను భారత్‌ కలిగి ఉందన్నారు.  డిజిటల్‌ చెల్లింపుల్లో భారత్‌ అగ్రగామిగా కొనసాగుతోందని.. భారత్‌ను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే   లక్ష్యమని ప్రకటించారు.
నెల రోజుల క్రితం  మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. నా మూడో టర్మ్‌లో మూడింతల శక్తితో పని చేస్తానని ఆ రోజు ప్రతిజ్ఞ చేశానని అని ప్రధాని మోదీ ప్రవాస భారతీయలగు గుర్తు చేశారు.    ప్రధానిగా మూడో సారి బాధ్యతలు చేపట్టిన మోదీ తొలిసారి రష్యాలో పర్యటిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నారు,   ఫైటర్ జెట్ SU-57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.
ఘన స్వాగతం
మై బెస్ట్‌ ఫ్రెండ్‌ మోదీ. భారత్‌-రష్యా బంధం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ ఒక్కమాట చాలు. మాస్కోలో అచ్చంగా ఇదే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ ఆకాశానికి ఎత్తేశారు. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ సంబోధించారు. రష్యాకు వచ్చిన మన ప్రధాని మోదీకి మాస్కో అవతల ఉన్న అధ్యక్షుడి నివాసంలో లభించిన గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఇది. అమెరికా, యూరప్‌ తోపాటు మాజీ సోవియట్‌ దేశాలు పుతిన్‌పై కత్తులు నూరుతున్నవేళ, భారత ప్రధాని టూర్‌, రష్యాకు పెద్ద బలాన్ని, గొప్ప రిలీఫ్‌ని ఇచ్చింది. కరోనా తర్వాత ప్రధాని తొలిసారి రష్యా వెళ్లారుఇది పూర్తి అధికారిక కార్యక్రమం కాదు. కానీ మర్యాదపూర్వకంగా సాగిన ప్రైవేట్‌ కార్యక్రమం. పెద్ద ఎస్టేట్‌లా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో మోదీ-పుతిన్‌ గంటపాటు చర్చించారు. షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు, బ్యాటరీ వాహనాల్లో ప్రయాణిస్తూ, ఇద్దరు నేతలు ప్రపంచ దేశాలను ఆకర్షించారు. భారత్‌-రష్యా మధ్య ఉన్న చిరకాల మైత్రీబంధానికి ఈ మీటింగ్‌ ఒక నిదర్శనం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరుదేశాధినేతలు ఈ చాయ్‌పే చర్చలో, డిన్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుకున్నారు,ఈ క్రమంలో రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించే అంశాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రస్తావించారు. దీని తరువాత, అధ్యక్షుడు పుతిన్, భారతీయులు త్వరలో దేశానికి తిరిగి వస్తారని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.వాస్తవానికి, రష్యా సైన్యంతోపాటు ఉక్రెయిన్‌పై పోరాడటానికి భారతీయ పౌరులను బలవంతంగా తరలిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. భద్రతా సహాయకులుగా పని చేసేందుకు భారతీయులను మోసపూరితంగా సరిహద్దులకు పంపుతున్నారు కొందరు ఏజెంట్లు. నవంబర్ 2023 నుండి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో దాదాపు 18 మంది భారతీయులు చిక్కుకుపోయారని ఒక ఏజెంట్ సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరు దేశాధినేతల భేటీతో బలవంతంగా చిక్కుపోయిన భారతీయులకు విముక్తి లభిస్తోంది.ఇదిలావుంటే, రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని మోదీ ఇప్పటికే డిన్నర్‌ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ రెండు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. అలాగే రొసాటోమ్‌ పెవిలియన్‌ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. న్యూక్లియర్‌ టెక్నాలజీలో రష్యా సాధించిన విజయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌లో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత 22వ రష్యా-ఇండియా సదస్సులో పుతిన్‌తో కలిసి మోదీ పాల్గొంటారు.అయితే ప్రధాని మోదీ రష్యా టూర్‌పై అమెరికా ఆచితూచి స్పందించింది. ఉక్రెయిన్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణంగానే, మోదీ స్పందించాలని అగ్రరాజ్యం కోరింది. భారత్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అనీ, అయితే ఇందులో రష్యా విషయంలో సంబంధాలు కూడా ముఖ్యమేనని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ చెప్పారు.

ప్రధాని మోదీపై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసల జల్లు
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు సోమవారం మాస్కో వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఘన స్వాగతం పలికారు. తన అధికారిక నివాసం నోవో-ఒగారియోవోలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని, విజయాలను పుతిన్ ప్రశంసించారు. ‘ప్రియమైన స్నేహితుడు’ అంటూ మోదీని పలకరించారు. మోదీని కలవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భారత ప్రధానిగా మరోసారి ఎన్నికైన మోదీకి అభినందనలు తెలిపారు. ఏదో యాదృచ్ఛికంగా మూడోసారి ప్రధాని కాలేదని, భారతదేశ పురోగతికి కృషి చేశారంటూ పుతిన్ ప్రశంసించారు. చాలా ఏళ్లుగా చేసిన కృషికి ఫలితంగా తిరిగి ప్రధాని అయ్యారని మెచ్చుకున్నారు. మోదీ అంకిత భావంతో కృషి చేస్తారని, శక్తిమంతమైన ఆయన నాయకత్వంలో భారత్ ప్రయోజనం పొందుతుందని అన్నారు.

‘‘మీకు మీ సొంత ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా చురుకైన వ్యక్తి. భారతదేశం, దేశ ప్రజల ప్రయోజనాల కోసం చక్కటి ఫలితాలను సాధించగలరు’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రయోజనాల కోసం మోదీ చేస్తున్న కృషికి పుతిన్ అభినందనలు తెలిపారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పటిష్టంగా ఉందని మెచ్చుకున్నారు. పుతిన్ అధికారిక నివాసంలో ఇరువురి మధ్య అనధికారిక చర్చల సందర్భంగా రష్యా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని మంత్రి అయ్యాక ఆయనకు ఇది రెండో విదేశీ పర్యటన కావడం విశేషం. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు వెళ్లడం ఇదే తొలిసారి.

కాగా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం విస్తృత చర్చలు జరపనున్నారు. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయి. సమావేశాల అనంతరం ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉందని రష్యా మీడియా వర్గాలు పేర్కొన్నాయి.